పవర్ స్టార్ “భీమ్లా నాయక్” ఆహా కట్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్

పవర్ స్టార్ “భీమ్లా నాయక్” ఆహా కట్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్

Published on Mar 18, 2022 4:45 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సం హంక్ రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ చిత్రం ఆహా వీడియో లోకి ఈ మార్చ్ 25 నుండి డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులకు, అభిమానులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆహా వీడియో ట్రైలర్ ను కట్ చేయడం జరిగింది. యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు