“బిగ్ బాస్ తెలుగు 7” లాంఛ్ ఈవెంట్ కి రెస్పాన్స్ ఇదే!

Published on Sep 14, 2023 7:31 pm IST

బుల్లితెర రియాలిటీ షోలలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న షో ఏదైనా ఉంది అంటే, అది బిగ్ బాస్ షో అని చెప్పాలి. సరికొత్తగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇటీవల గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ఈవెంట్ ను ప్రసారం చేయడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి.

తాజాగా రిలీజ్ చేసిన టీఆర్పీ రేటింగ్ లో, బిగ్ బాస్ తెలుగు 7 మంచి రేటింగ్ ను నమోదు చేసుకుంది. 12.46 రేటింగ్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :