టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేయడం జరిగింది. కల్ట్ మామ సాంగ్ ను రిలీజ్ చేయగా, అందుకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకు పోతుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.