“డేగల బాబ్జీ” ట్రైలర్ కి విశేష స్పందన!

Published on Nov 9, 2021 6:00 pm IST

బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డేగల బాబ్జి. యశ్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని స్వాతి.ఎస్ నిర్మిస్తుండగా ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

అయితే ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ లో బండ్ల గణేష్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ యూ ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ ను సాధించడం జరిగింది. డేగల బాబ్జి తో హీరోగా మారిన బండ్ల గణేష్ తొలి చిత్రం ట్రైలర్ కి వన్ మిలియన్ వ్యూస్ రావడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :