“గాడ్ ఫాథర్” ఫస్ట్ సింగిల్ కి అదిరే రెస్పాన్స్.!

Published on Sep 23, 2022 3:28 pm IST

ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఎన్నో సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో ఇప్పుడు రాబోతున్న మరో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ కాగా..

ఇందులో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ అయితే మంచి చార్ట్ బస్టర్ అయ్యింది. తెలుగు మరియు హిందీలో రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రెండు భాషల్లో కలిపి 17 మిలియన్ కి పైగా వ్యూస్ తో ఈ సాంగ్ దూసుకెళ్తుంది. మరి ఇదైతే మంచి రెస్పాన్స్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు అలాగే కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :