కొండపోలం చిత్రం కి బుల్లితెర పై విశేష స్పందన!

Published on Jan 13, 2022 6:30 pm IST


ఉప్పెనతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత, పంజా వైష్ణవ్ తేజ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో కొండపోలం కోసం చేతులు కలిపాడు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2021లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అంతగా రన్ అవ్వని ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోతో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది.

స్టార్ మాలో ప్రసారమైన ఈ చిత్రం అర్బన్‌లో 12.34 టీఆర్‌పిని, అర్బన్ మరియు రూరల్‌లో 10.54 టిఆర్‌పిని సాధించింది. ఈ టీఆర్పీలకు పలువురు ట్రేడ్ పండితులు షాక్ అయ్యారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

సంబంధిత సమాచారం :