లైగర్ ఆటిట్యూడ్ “వాట్ లగా దేంగే” కి హ్యూజ్ రెస్పాన్స్!

Published on Jul 29, 2022 3:34 pm IST


విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ చిత్రం పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ను వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 25, 2022 న గ్రాండ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

ప్రమోషన్స్ లో భాగం గా ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా హీరో ఆటిట్యూడ్ కి తగ్గట్లు గా వాట్ లగా దేంగే వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో కి ఇప్పటి వరకూ 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం, 100 కే కి పైగా లైక్స్ వచ్చాయి. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, రమ్య కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :