“బుల్లితెర” పై మసూద కి రెస్పాన్స్ ఇదే!

Published on Mar 16, 2023 6:00 pm IST

సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మసూద. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం, ఇటీవల జెమినీ టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బుల్లితెర పై ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం 5.2 టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేయడం జరిగింది. చిన్న చిత్రానికి ఈ తరహా టీఆర్పీ అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ప్రశాంత్ ఆర్. విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :