బన్నీ రిలీజ్ చేసిన “పుష్పక విమానం” ట్రైలర్ కి అదిరే రెస్పాన్స్!

Published on Oct 31, 2021 7:36 pm IST

ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్పక విమానం. ఈ చిత్రం లో గీత్ సైని, శాన్వి మేఘన లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, సునీల్, నరేష్, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని గోవర్ధన రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను బన్నీ రిలీజ్ చేయడం తో ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ట్రైలర్ 2.2 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించడం జరిగింది. అంతేకాక 107కే లైక్స్ ను సొంతం చేసుకుంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం తో సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని తెలుస్తుంది.

ట్రైలర్ కొసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :