రామ్ పోతినేని “ది వారియర్” ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్!

Published on May 15, 2022 10:02 pm IST

ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తదుపరి చిత్రం ది వారియర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలై అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 14, 2022న థియేటర్లలో విడుదల కానుంది. తాజా సమాచారం ఏమిటంటే వారియర్ తెలుగు, తమిళ ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది.

తెలుగు ట్రైలర్‌కు 10.6 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ రాగా, తమిళ ట్రైలర్ 24 గంటల్లో 2.4 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ కాప్ డ్రామాలో కృతి శెట్టి, అక్షర గౌడ, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి తన హోమ్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై నిర్మించిన ఈ ద్విభాషా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :