వరుణ్ తేజ్ “గని” నుండి రిలీజైన రోమియో జూలియట్ సాంగ్ కి విశేష స్పందన!

వరుణ్ తేజ్ “గని” నుండి రిలీజైన రోమియో జూలియట్ సాంగ్ కి విశేష స్పందన!

Published on Feb 9, 2022 3:02 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. ఈ చిత్రం లో టైటిల్ రోల్ ను పోషిస్తున్న వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాల పై అల్లు బాబీ మరియు సిద్ధు ముద్ద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి రోమియో జూలియట్ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాట కి రఘురాం లిరిక్స్ రాయగా, అదితీ శంకర్ పాడటం జరిగింది. ఈ పాటకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. యూ ట్యూబ్ లో సైతం ఇప్పటి వరకు మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీలైన త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు