ఓటిటి లో ఈ యాక్షన్ డ్రామాకి సూపర్ రెస్పాన్స్!

Published on Feb 17, 2023 2:00 pm IST

స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ 125వ చిత్రం వేద కన్నడలో కమర్షియల్‌గా విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులోనూ ఇటీవల విడుదలైంది. భజరంగీ ఫేమ్ హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా, థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు జీ5 లో ప్రసారం అవుతోంది. తాజా అప్డేట్ ఏమిటంటే, ఈ చిత్రం జీ5 లో సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసింది.

కన్నడలోనే కాదు, ఈ చిత్రం ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో ప్రధాన భారతీయ భాషలలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. వేద చిత్రంలో గానవి లక్ష్మణ్, ఉమాశ్రీ, అదితి సాగర్, శ్వేత చెంగప్ప తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అర్జున్ జ‌న్య సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :