సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ‘తొలిప్రేమ’ ఆడియో !


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఫిదా’ తర్వాత చేసిన చిత్రం ‘తొలిప్రేమ’. దీంతో ఈ చిత్రంపై బోలెడు అంచనాల్ని పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. నిన్ననే ఈ సినిమా యొక్క ఆడియో విడుదలైంది. థమన్ స్నాగీతం అందించిన ఈ ఆల్బమ్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంటోంది. టైటిల్ కి తగ్గట్టే పాటలన్నీ క్లాసీగా, వినసొంపుగా ఉన్నాయనే కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి.

ఈ ఫీడ్ బ్యాక్ తో ఆడియో సినిమా విజయానికి దోహదపడే అవకాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా రాశీఖన్నా నటిస్తోంది. ఎక్కువ శాతం ఫారిన్లో షూట్ జరుపుకున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, హైపర్ ఆది వంటివారు కూడా నటించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న ఈ చిత్రం తప్పకుండా అభిమానుల్ని మెప్పించే విధంగా ఉంటుందని వరుణ్ తేజ్ బలమైన హామీ కూడా ఇచ్చారు.