వరుణ్ “గని” ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్

వరుణ్ “గని” ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్

Published on Mar 18, 2022 3:01 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకంపై అల్లు బాబీ మరియు సిద్ధు ముద్ద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ వచ్చాయి. ఒక్క రోజు లోనే 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, 214కే కి పైగా లైక్స్ వచ్చాయి. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు