బుల్లితెర పై సత్తా చాటిన “పెళ్లి సందD”

బుల్లితెర పై సత్తా చాటిన “పెళ్లి సందD”

Published on Jul 28, 2022 7:30 PM IST

రోషన్, శ్రీ లీలా హీరో హీరోయిన్ లుగా గౌరీ రొనంకి దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ పెళ్లి సందD. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం లో విఫలం అయింది. పెళ్లి సందడి చిత్రం కి ఉన్న క్రేజ్ దీని పై కచ్చితంగా పడింది అని చెప్పాలి. అయితే కే. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ ప్రీమియర్ కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఈ చిత్రానికి 8.62 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. RK ఫిల్మ్స్ అసోసియేట్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ ల పై నిర్మించిన ఈ చిత్రం కి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఇంత మంచి టీఆర్పీ రావడం తో ఆడియెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు