8 వ వారం కూడా మంచి టీఆర్పీ ను నమోదు చేసిన బిగ్ బాస్ 5

Published on Nov 8, 2021 9:02 pm IST

స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా నమోదు అయిన టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ ఏ తరహా ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తుంది అనేది తెలుస్తుంది. 8 వ వారం బిగ్ బాస్ మంచి టీఆర్పీ ను నమోదు చేయడం జరిగింది. వీకెండ్ లో 8.17 గా నమోదు కాగా, వీక్ డేస్ లో 5.20 యావరేజ్ ను నమోదు చేయడం జరిగింది.

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో లో టాస్క్ లు ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తున్నాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. నామినేషన్ల ప్రక్రియ నుండి ఎలిమినేశన్ ల వరకూ కూడా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తున్నారు. వారాలు గడుస్తున్న కొద్ది ఎవరు హౌజ్ లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సరికొత్త ట్విస్టు లతో మరింత ఆసక్తికరంగా బిగ్ బాస్ షో సాగుతుంది.

సంబంధిత సమాచారం :