“జాతి రత్నాలు” చిత్రానికి ఎంత టీఆర్పీ వచ్చిందంటే?

Published on Sep 3, 2021 4:48 pm IST

నవీన్ పోలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జాతి రత్నాలు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి భారీ విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. బుల్లితెర పై సైతం అదే తరహాలో తన సత్తా ను చాటడం జరిగింది.

ఈ చిత్రం ఆగస్ట్ 22 వ తేదీన జెమిని టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విడుదల అయింది. ఈ చిత్రం కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. 10.21 టీఆర్పీ ను సొంతం చేసుకుంది. అనుదీప్ కేవీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ను మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :