లెజెండరీ నటునికి గూగుల్ ఘన నివాళి.!

Published on Oct 1, 2021 9:00 am IST


మన భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎందరో సీనియర్ నటులు ఆయా సినీ ఇండస్ట్రీల నుంచి ఉన్నారు. మన తెలుగు నుంచి ఎలా అయితే పలువురు దిగ్గజ నటులు ఉన్నారో అలానే తమిళ, మళయాళ ఇండస్ట్రీల నుంచి కూడా ఉన్నారు. మరి కోలీవుడ్ కి చెందిన విలక్షణ దివంగత నటులలో శివాజీ గణేశన్ కూడా ఒకరు.

తమిళ తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో తనదైన నటనను కనబరిచిన శివాజీ గణేశన్ 93వ జయంతి ఈరోజు కావడంతో ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ వారు ఘన నివాళి అర్పించి గౌరవాన్ని వ్యక్త పరిచారు.

వారి డూడుల్ లో శివాజీ గణేశన్ గారి ఫోటోలను పొందుపరిచి సెట్ చేసారు. దీనితో ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు అలాంటి లెజెండరీ పర్సనాలిటీకి ఇది ఓ అరుదైన గౌరవమే అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :