‘బాహుబలి 2’ ని సరికొత్తగా ప్రెజెంట్ చేసిన గూగుల్ !


ఈ మార్చి నెల 15వ తారీఖున విడుదలైన ‘బాహుబలి 2’ ట్రైలర్ ఎంతటి హవా సృష్టించిందో వేరే చెప్పనక్కర్లేదు. విడుదలై నాలుగు రోజులు గడుస్తున్నా ఈ ట్రైలర్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇప్పటికే పలు రికార్డుల్ని బద్దలు కొట్టిన ఈ ట్రైలర్ తాజాగా అన్ని భాషల్లో కలిపి మిలియన్ లైక్స్ పొంది ప్రపంచస్థాయి రికార్డ్ సృష్టించింది. అంతేగాక వరల్డ్ వైడ్ గూగుల్ ట్రెండింగ్స్ లో కూడా టాప్ లో నిలిచింది.

అందుకే గూగుల్ ఇండియా కాస్త వెరైటీగా ఈ వార్తను సెలబ్రేట్ చేసింది. బాహుబలితోపాటు ట్రెండ్ అయిన ఐన్ స్టీన్, హొలీ కలిపి ఒక వీడియోను తయారుచేసింది. అందులో బాహుబలి పాత్రకు ఐన్ స్టీన్ కాస్ట్యూమ్స్, కళ్ళజోడు తగిలించి పక్కనే ఐన్ స్టీన్ ఫార్ములాను కూడా ఉంచి ఒక జీనియస్ మైండ్ యుద్ధ వీరుడి గుండెతో కలిస్తే కలర్ ఫుల్ గా ఉంటుంది అంటూ హైలీ రంగుల్ని కూడా చల్లింది. ఇలా గూగుల్ ఇండియా ఒక టైలర్ ట్రేండింగ్ ను ఇలా ప్రెజెంట్ చేయడం ఇదే మొదటిసారి.