
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ సినిమా రిలీజ్ కి ముందే కేవలం ఫస్ట్ లుక్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని నవంబర్ 28న రిలీజ్ చేసారు. ఈ మోషన్ పోస్టర్ నేటితో ఐ మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. ఒక మోషన్ పోస్టర్ కి ఈ రేంజ్ వ్యూస్ రావడం అందరినీ షాక్ చేసింది. ఈ విషయం ఒక్క సౌత్ నే కాకుండా నేషనల్ మీడియాని కూడా షాక్ చేసింది. ఇప్పటివరకూ ఈ మోషన్ పోస్టర్ యు ట్యూబ్ వ్యూస్ 1,016,740.
ఇలా ఒక మోషన్ పోస్టర్ కె ఇన్ని క్లిక్స్ రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రసతుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆడియోని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అమూప్ రూబెన్స్ అన్చిన ఈ ఆల్బంలో కేవలం 3 పాటలు మాత్రమే ఉంటాయి. కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గోపాల గోపాల మోషన్ పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి