పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న టాలీవుడ్ మోస్ట్ క్రీజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన నానక్రాంగూడాలో వేసిన ఓ సెట్లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ – వెంకటేష్ లమీద కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ప్రస్తుతం వెంకటేష్ మరియు ప్రముఖ నటీనటులపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ఇటీవలే లహరి మ్యూజిక్ వారు ‘గోపాల గోపాల’ ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్నారు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల’లో వెంకటేష్ ఓ మిడిల్ క్లాస్ కామన్ మాన్ లాగా కనిపిస్తుంటే, పవన్ కళ్యాణ్ శ్రీ కృష్ణుడుగా కనిపించనున్నాడు. వెంకటేష్ కి జోడీగా శ్రియ శరన్ నటిస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ మరార్ – డి. సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మధుశాలిని, దీక్ష పంత్ లు కూడా ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
