‘గోపాల గోపాల’- బాగుందయ్యా మీ లీల

Gopala Gopala
హిందీ సినిమా ‘ఓ మై గాడ్‌’ సినిమాకు రీమేక్ గా తెలుగులో రూపొందుతున్న సినిమా ‘గోపాల గోపాల’. విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నేడు విడుదల చేశారు. ఈ లుక్ అంచనాల్ని అమాంతం పెంచేసింది.

మోడరన్ శ్రీకృష్ణుడిగా ఉయ్యాలలో సేదతీరుతున్న పవన్, ఆ వెనుకే పవన్ ను ఇమిటేట్ చేస్తున్న వెంకి ఈ లుక్ లో కనిపించారు. సాధారణంగా రీమేక్ సినిమా అనగానే ఒరిజినల్ సినిమాతో కంపెరిజన్స్ మొదలవుతాయి. అసలు ఆ అంశమే గుర్తు రాకుండా పవన్, వెంకి మాయ చేశారు. అనూప్ అందించిన నేపధ్య సంగీతం కూడా బాగుంది. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను.. పవన్, వెంకి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వీరిద్దరూ స్టార్ హీరోలు అనే విషయాన్ని అందరూ మర్చిపోయారు. ‘గోపాల గోపాల’ – బాగుందయ్యా మీ లీల అంటూ ప్రసంశిస్తున్నారు.

కిషోర్‌ పార్దసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పవన్‌ స్నేహితుడు శరత్ మరార్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version