కన్ఫర్మ్ : ‘గోపాల గోపాల’ రిలీజ్ డేట్

Gopala-Gopala1

విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమాను ఎ రోజున విడుదల చేస్తారు అనే విషయంలో పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ పుకార్లకు చెక్ పెడుతూ.. నిర్మాతలు అధికారికంగా విడుదల తేదిను ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తున్నట్టు చెప్పారు.

వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్నారు. దేవుడిపై కేసు వేసే వ్యక్తిగా నాస్తికుడి పాత్రలో వెంకటేష్ కనిపిస్తారు. కిషోర్ పార్దసాని (డాలి) దర్శకుడు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఓ మై గాడ్’ సినిమాకు ఇది రీమేక్.

Exit mobile version