చైతు సినిమాకు సంగీత దర్శకుడు ఖరారు !

నాగ చైతన్య దర్శకుడు మారుతిల కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమయ్యింది. జనవరి 19 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమాకు ‘శైలజ రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ఖరారు చేసారు. అను ఇమ్మానుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇగో పాత్రలో నాగ చైతన్య కనిపించబోతున్నాడు.

గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాబోతున్నాడు. లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ బాగా వచ్చిందని సమాచారం. ఈ మూవీ తో పాటు చైతు ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తున్నాడు. చందు మొండేటిఈ సినిమాకు దర్శకుడు. మారుతి సినిమాకు సంభందించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.