ఇంట్రెస్టింగ్..గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో సినిమా

Published on Sep 9, 2023 2:00 pm IST


మన టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా ఇపుడు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గా “రామబాణం” అనే సినిమాతో తాను పలకరించారు. అయితే గోపీచంద్ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని అయితే లాక్ చేయడం జరిగింది. మన టాలీవుడ్ లో తన సినిమాలకి అంటూ ఒక మార్క్ ని సెట్ చేసుకున్న ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో అయితే ఇప్పుడు గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

ఇదిలా ఉండగా ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో సినిమా ఈరోజే అనౌన్స్ కాగా హైదరాబాద్ లో ముహూర్తంతో కూడా స్టార్ట్ అయ్యింది. మరి ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో 32వ సినిమా కాగా దాదాపు ఐదేళ్ల తర్వాత కొత్త సినిమా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంతో అయితే సరికొత్త నిర్మాణ సంస్థ చిత్రాలయం ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ కి పరిచయం అవుతుండగా ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా అయితే దీనిని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :