“మంచి రోజులు వచ్చాయి” ప్రీ రిలీజ్ వేడుకకు మ్యాచో స్టార్..!

“మంచి రోజులు వచ్చాయి” ప్రీ రిలీజ్ వేడుకకు మ్యాచో స్టార్..!

Published on Oct 28, 2021 5:00 PM IST

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “మంచి రోజులు వచ్చాయి”. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదిన రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై మరింత అంచనాలను పెంచాయి.

అయితే రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 29న ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకోబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మ్యాచో స్టార్ గోపిచంద్ హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు