మార్చి నుండి మొదలుకానున్న ‘పుల్లెల గోపీచంద్’ బయోపిక్ !

2nd, November 2017 - 09:00:37 AM

దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చేఏడాది మార్చి నుండి ప్రారంభం కానుంది. ఇందులో గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన ప్రత్యేకంగా బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. స్వతహాగా సుధీర్ బాబు బ్యాడ్మింటన్ ఆటగాడు కావడం, చానళ్ల నుండి గోపిచంద్ ను దగ్గర నుండి చూసిన వ్యక్తి కావడంతో ప్రవీణ్ సత్తారు ఆయన్ను ఎంచుకున్నారు.

గోపీచంద్ జీవితంలో బయటకు తెలియని చాలా విశేషాలున్నాయని, కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాని డ్రామా ఉందని, ఒక రకంగా చెప్పాలంటే సినిమా కోసం ఆ డ్రామాను కొద్దిగా తగ్గించానని అన్నారు. 2018 లో మొదలయ్యే సినిమా 2019 కి రిలీజవుతుందని, ప్రస్తుతం ఇతర నటీ నటుల ఎంపిక జరుగుతోందని అన్నారు. ఇకపోతే ప్రవీణ్ డైరెక్ట్ చేసిన ‘పిఎస్వి గరుడవేగ’ రేపే భారీ ఎత్తున రిలీజ్ కానుంది.