సెట్‌లో హీరో గోపిచంద్‌కు ప్రమాదం..!

Published on Apr 29, 2022 10:44 pm IST


టాలీవుడ్ మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. లక్ష్యం, లౌక్యం సినిమాలతో రెండు విజయాలను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ ఇప్పుడు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ఇటీవలే మైసూర్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ నేపధ్యంలోనే ఓ ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్‌ స్పాట్‌లో కాస్త ఎత్తైన ప్రదేశం నుంచి కాలు జారి కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు గాయాలు కాలేదని, ప్రస్తుతం గోపీచంద్‌ క్షేమంగానే ఉన్నారని డైరెక్టర్‌ శ్రీవాస్‌ తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :