ఇంటర్వ్యూ : అను ఇమ్మాన్యుయేల్ – గోపీచంద్ గారు నిజమైన జెంటిల్మెన్
Published on Oct 29, 2017 3:32 pm IST

‘మజ్ను’ సినిమాతో పరిచయమై ప్రస్తుతం స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తున్న నటి ‘అను ఇమ్మాన్యుయేల్’ గోపీచంద్ తో కలిసి చేసిన సినిమా ‘ఆక్సిజన్’. నవంబర్ 17న చిత్ర రిలీజ్ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘ఆక్సిజన్’ చిత్రంలో మీ రోల్ గురించి చెప్పండి ?
జ) ఇందులో నా పేరు గీత. డాక్టర్ రోల్ చేశాను. కథలో ఏం చేశాననేది సినిమా చూసే తెలుసుకోవాలి. మంచి పాత్ర.

ప్ర) మీ ఫస్ట్ తెలుగు సినిమా ఇదేనా ?
జ) అవును ఇదే నా మొదటి తెలుగు సినిమా. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ‘మజ్ను’ ఆఫర్ వచ్చింది.

ప్ర) సెట్స్ లో తెలుగు మాట్లాడటం మీకు కష్టంగా అనిపించిందా ?
జ ) అవును.. చాలా కష్టమనిపించింది. ఆ తర్వాత మెల్లగా కొంచెం నేర్చుకున్నాను. ఇప్పుడు పర్వాలేదు.

ప్ర) మీకు తెలుగులో ఆఫర్ ఎలా వచ్చింది ?
జ) నేను మలయాళం సినిమా ‘యాక్షన్ హీరో బిజు’ చేశాను. ఆ సినిమా చూసిన దర్శక నిర్మాతలు నాకీ ఆఫర్ ఇచ్చారు. అలా తెలుగులో ఎంటరయ్యాను.

ప్ర) హీరో గోపీచంద్ తో పనిచేయడం ఎలా అనిపించింది ?
జ) ఆయన చాలా మంచి వారు. నిజమైన జెంటిల్మెన్. తెలుగులో పెద్ద యాక్షన్ హీరో అయినప్పటికీ ఎప్పుడూ స్టార్ లా ఉండలేదు. చాలా సాధారణంగా ఉండేవారు.

ప్ర) మీ కెరీర్ పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా ?
జ) అవును. ప్రస్తుతం నా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారితో, అల్లు అర్జున్ గారితో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం.

ప్ర) పవన్ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది ?
జ) కథలోని ఇద్దరు హీరోయిన్లలో నేను ఒకరు. నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర అది. సినిమా రిలీజ్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను.

ప్ర) ‘ఆక్సిజన్’ దర్శకుడు జ్యోతి కృష్ణ గురించి చెప్పండి ?
జ) అస్సలు తెలుగు రాణి నాకు చాలా సపోర్ట్ చేశారు. సెట్స్ లో ఒక చిన్న పిల్లలా నన్ను ట్రీట్ చేసి ప్రతి డైలాగ్ ను చాలా ఓపిగ్గా వివరించి చెప్పేవారు.

ప్ర) అసలు ఈ ‘ఆక్సిజన్’ దేని గురించి ?
జ) ఇదొక హెవీ యాక్షన్ సినిమా. దానితో పాటే మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఇప్పటికి ఇంత వరకు మాత్రమే చెప్పగలను(నవ్వుతూ).

ప్ర) గ్లామర్ రోల్స్ చేయడానికి మీరు సిద్దమేనా ?
జ) నా దృష్టిలో గ్లామర్ రోల్స్ చేయడానికి, వల్గర్ రోల్స్ చేయడానికి చాలా తేడా ఉంది. కాబట్టి గ్లామర్ రోల్స్ చేయడానికి నేనెప్పుడూ సిద్దమే.

 
Like us on Facebook