షూటింగ్ మొద‌లుపెట్టిన గోపీచంద్ – స‌న్నీ డియోల్ మూవీ

షూటింగ్ మొద‌లుపెట్టిన గోపీచంద్ – స‌న్నీ డియోల్ మూవీ

Published on Jun 22, 2024 9:01 PM IST

టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఇటీవ‌ల ఓ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. బాలీవుడ్ యాక్ష‌న్ హీరో స‌న్నీ డియోల్ తో క‌లిసి ఆయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని.. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్ష‌న్ మూవీగా రానుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

ఈ అనౌన్స్ మెంట్ తో ఒక్క‌సారిగా అంద‌రి చూపులు ఈ ప్రాజెక్టుపై ప‌డ్డాయి. ఇక పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, తాజాగా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లుపెట్టారు. శ‌నివారం రోజున ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లుగా మేకర్స్ వెల్ల‌డించారు. కీల‌క స‌న్నివేశాన్ని ఈ ఫ‌స్ట్ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నట్లుగా వారు ప్ర‌క‌టించారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ రెజీనా క్యాసాండ్రా, సాయామి ఖేర్ లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మాత‌లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు