గోపీచంద్ ఆక్సిజన్ కొత్త విడుదల తేది !
Published on Oct 21, 2017 10:32 am IST


మాస్ హిరోల్లో మంచి క్రేజ్ ఉన్న హిరో గోపిచంద్. గోపీచంద్ నటించిన తాజా చిత్రం ‘ఆక్షిజన్’ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశిఖన్నా, అను ఇమ్యనుల్ కథానాయికలుగా నటించారు, యువన్ శంకర్ రాజ అందించిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఇటివల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది.

ఈ చిత్రాన్ని ముందు అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ప్రకటించారు చిత్ర యూనిట్, కాని కొన్ని అనివార్య కారణాలవల్ల విడుదల తేది నవంబర్ 10 కి వాయిదా పడింది. అక్టోబర్ 23న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెయ్యబోతున్నారు, ఈ వేడుకకు ప్రభాస్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాతో గోపీచంద్ విజయం సాదిస్తాడని ఆశిద్దాం.

 
Like us on Facebook