గోపీచంద్ – శ్రీవాస్ ల ‘రామబాణం’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Mar 4, 2023 5:02 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్, యువ దర్శకుడు శ్రీవాస్ ల కలయికలో తెరకెక్కుతున్న ఫామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రామబాణం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు రెండూ కూడా పెద్ద సక్సెస్ సాధించడంతో తప్పకుండా రామబాణం కూడా మంచి సక్సెస్ అందుకుంటుందని, ఆ విధంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు శ్రీవాస్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అంటోంది యూనిట్. ఇక ఈ మూవీలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, కుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, ఆలీ వంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో పాటు ఫస్ట్ యారో గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా మ్యాటర్ ఏమిటంటే, రామబాణం మూవీని మే 5న సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ప్రస్తుతం స్టూడెంట్స్ కి పరీక్షల సీజన్ కావడంతో అందరూ చక్కగా చదివి పరీక్షలు రాయాలని, అలానే వేసవి సెలవుల్లో అందరం కలుద్దాం అంటూ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రామబాణం టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :