“సీటీమార్” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్.!?

Published on Oct 8, 2021 2:46 pm IST


టాలీవుడ్ మ్యాచో మాన్ గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టి బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లతో లాంగ్ రన్ ని ఫినిష్ చేసుకుంది. అయితే మరి ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్నారట. మరి ఇందులో ఈ సినిమా వచ్చే అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తుంది. సో అప్పుడు మిస్సయిన వారు ఇపుడు చూడొచ్చు.. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :