సెన్సార్ సర్టిఫై చేసేసుకున్న “సీటీమార్” చిత్రం.!

Published on Sep 4, 2021 2:00 pm IST

మన టాలీవుడ్ మ్యాచో మాన్ అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ మాస్ అండ్ స్పోర్ట్స్ డ్రామాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు నుంచో రిలీజ్ రెడీ కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు వినాయక చవితి కానుకగా రిలీజ్ అవ్వనుంది.

మరి మొన్ననే ట్రైలర్ తో భారీ రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ కంప్లీట్ చేసేసుకుంది. మరి ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ ను అందజేశారు. ఆల్రెడీ మేకర్స్ అవుట్ పుట్ పై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ట్రైలర్ లో మంచి ఎమోషన్స్ సహా అదిరే యాక్షన్ కూడా కనిపించింది.

దీనితో సినిమాపై మరిన్ని అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే వచ్చే 10 వరకు ఆగక తప్పదు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :