గోపీచంద్ తో శ్రీను వైట్ల సినిమా… నిజమేనా ?

Published on Oct 3, 2022 11:18 pm IST

డైరెక్టర్ శ్రీను వైట్ల గోపీచంద్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా గోపీచంద్ కి శ్రీను వైట్ల ఓ కథ చెప్పాడని, గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, నిర్మాత అనిల్ సుంకర, గోపీచంద్ హీరోగా – శ్రీను వైట్ల దర్శకుడిగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఈ మధ్య శ్రీను వైట్ల సక్సెస్ ట్రాక్ లో లేడు. కాబట్టి.. ఎలాగైనా సక్సెస్ ను కొట్టాలనే కసితో శ్రీను వైట్ల తన తర్వాత సినిమా కోసం పని చేస్తున్నాడు. మరి, గోపీచంద్ ఇమేజ్ కోసం శ్రీను వైట్ల ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య శ్రీను వైట్ల, రవితేజతో సినిమా చేయబోతున్నట్లులు వార్తలు వచ్చాయి.

అయితే, గోపీచంద్ అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని శ్రీను వైట్ల ఫీల్ అవుతున్నాడట. ఏది ఏమైనా శ్రీను వైట్ల సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :