అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు హీరో గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్‌”

Published on Sep 12, 2021 5:00 pm IST

గోపీచంద్, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టెనర్ ఆరడుగుల బుల్లెట్‌. జయ బాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ మేకింగ్, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్ గా ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బీ. గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తుండగా, బాలమురుగన్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగా అందించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :