గోపీచంద్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు !

‘ఆక్సిజన్’ సినిమా తరువాత గోపీచంద్ నటిస్తున్న 25వ సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. నూతన దర్శకుడు చక్రి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో రాధామోహన్ నిర్మిస్తున్నారు. మంచి కథ, కథనం తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.

ఈ సినిమాలో మెహరీన్ టీచర్ పాత్రలో కనిపించబోతోంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ సినిమాతో గోపీచంద్ తప్పకుండా విజయం సాధిస్తాడని చిత్ర దర్శకుడు చక్రి నమ్మకంగా ఉన్నాడు. ఈ మూవీతో పాటు గోపీచంద్ మరికొన్ని సినిమాలు చెయ్యబోతున్నాడు, ఈ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.