తమిళంలో విడుదల కానున్న గోపీచంద్ సినిమా!

Published on Jun 26, 2022 11:02 pm IST


టాలీవుడ్ హీరో గోపీచంద్ తదుపరి చిత్రం పక్కా కమర్షియల్‌లో కనిపించనున్నారు, జూలై 1, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, సత్య రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా ఈ నటుడి చివరి సినిమా అయిన ఆరడుగుల బుల్లెట్ తమిళంలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి, జూలై 2022 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక గా నటించడం జరిగింది. గోపీచంద్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం పక్కా కమర్షియల్‌ని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :