బ్యాంకాక్ లో మొదలుకానున్న గోపీచంద్ కొత్త చిత్రం
Published on Sep 20, 2016 5:45 pm IST

gopichand
‘జిల్, సౌఖ్యం’ వంటి చిత్రాల తరువాత హీరో గోపీచంద్ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్లో ‘ఆక్సిజన్’ అనే చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతోపాటు గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్లో కూడా మరో చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. దీనికి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22 నుండి బ్యాంకాక్ లో మొదలుకానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జె. భార్గవన్, జె. పుల్ల రావులు సంయుక్తంగా ‘శ్రీ బాలాజీ సినీ మీడియా’ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, క్యాథరిన్ థ్రెస లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ 22న మొదలై 30 రోజుల పాటు ఏకధాటిగా జరగనుంది. ఇందులో హీరో, విలన్ ఇంట్రడక్షన్, ఓ పాత, కొన్ని కీలక కుటుంబ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాలో విలన్ గా ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ఫేమ్ ‘నికితిన్ ధీర్, ముఖేష్ రిషి’ లు విలన్లుగా నటిస్తున్నారు.

 
Like us on Facebook