ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆక్సిజన్ ‘ !


ఇటీవలే ‘గౌతమ్ నంద’ తో ప్రేక్షకుల్ని పలకరించిన మ్యాచో మ్యాన్ గోపీచంద్ త్వరలోనే మరొక చియాత్రంతో మన ముందుకురానున్నాడు. . ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్లో ఆయన చేసిన ‘ఆక్సిజన్’ చిత్రం చాల రోజుల క్రితమే అన్ని పనుల్ని పూర్తి చేసుకున్నా ఏవో కారణాల వలన విడుదల వాయిదాపడుతూ వచ్చింది. అందుకే ఇకపై ఆలస్యం చేయకూడదని భావించిన చిత్ర నిర్మాతలు విడుదల తేదీని ఖారారు చేసి ప్రకటించారు.

కొద్దిసేపటి క్రితమే అక్టోబర్ 12న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ విరివిగా వాడి రూపొందించిన ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ను శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.ఐశ్వర్య నిర్మించారు.