ఆకట్టుకుంటున్న గోపీచంద్ “పక్కా కమర్షియల్” ట్రైలర్ గ్లింప్స్!

ఆకట్టుకుంటున్న గోపీచంద్ “పక్కా కమర్షియల్” ట్రైలర్ గ్లింప్స్!

Published on Jun 8, 2022 6:57 PM IST


పక్కా కమర్షియల్ మేకర్స్ ఈరోజు ట్రైలర్ గ్లింప్స్‌ని ఆవిష్కరించారు. ఈ ముప్పై సెకన్ల వీడియో క్లిప్‌లో హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, హీరో గోపీచంద్ మరియు సత్యరాజ్ కోర్టు గదిలో లాయర్ గెటప్ లో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన రాశి ఖన్నా కనిపించనుంది. హీరో గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 12న ఫుల్ లెంగ్త్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినీ నిర్మాతలు కర్నూల్‌లో భారీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు.

మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరించారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 1న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల మాదిరిగా కాకుండా పక్కా కమర్షియల్‌ టిక్కెట్లను సాధారణ ధరలకే విక్రయిస్తామని నిర్మాత బన్నీ వాసు హామీ ఇచ్చారు.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు