పవర్ఫుల్ యక్షన్ తో ఆకట్టుకుంటున్న గోపీచంద్ ‘రామబాణం’ ఫస్ట్ యారో టీజర్

Published on Feb 18, 2023 6:16 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్ ఇటీవల మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయం అందుకోలేదు. ఇక ప్రస్తుతం శ్రీవాస్ తో రామబాణం అనే ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ మూవీ చేస్తున్నారు గోపీచంద్. గతంలో శ్రీవాస్, గోపీచంద్ ల కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు రెండూ పెద్ద సక్సెస్ అవ్వడంతో రామబాణం పై అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గోపీచంద్ ఈ సినిమాలో విక్కీ పాత్ర చేస్తుండగా ఆ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ యారో టీజర్ ని నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్.

పవర్ఫుల్ యక్షన్, ఫైట్ సీన్స్, అలరించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో గోపీచంద్ ఇంటెన్స్ లుక్ లో అదరగొట్టిన ఆ టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. గోపీచంద్ కెరీర్ 30వ సినిమాగా రూపొందుతున్న రామబాణంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతి బాబు, కుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, ఆలీ నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఎంతో భారీ వ్యయంతో నిర్మస్తున్నారు. కాగా రాబోయే సమ్మర్ కానుకగా ఈ మూవీ ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :