కొత్త సినిమాకు సైన్ చేసిన గోపీచంద్ !

‘ఆంధ్రుడు, య‌జ్ఞం, ల‌క్ష్యం, శౌర్యం, లౌక్యం’ వంటి సినిమాలతో మెప్పించిన యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తన 25వ సినిమా చక్రి అనే నూతన దర్శకుడితో చేస్తున్నాడు. గోపిసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా లో మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సినిమా తరువాత గోపీచంద్ వీరుపొట్ల దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి అంగీకరించాడు. బివీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ మూవీ తో పాటు తమిళ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు ఈ హీరో. ఒక్క క్షణం సినిమాను నిర్మించిన చక్రి చిగురుపాటి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.