ఈ సెన్సేషనల్ దర్శకునితో పవన్ సినిమా?అసలు జరిగే పనేనా?

Published on Jan 12, 2022 1:12 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సాలిడ్ మాస్ ప్రాజెక్ట్ “భీమ్లా నాయక్” తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ మరిన్ని భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వాటిలో ఒకటి సెట్స్ పై ఉండగా మరొకటి స్టార్ట్ కావాల్సి ఉంది.

మరి తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా అనేక సినిమాలు లైనప్ లో పెట్టిన పవన్ ఇంకో ఊహించని దర్శకునితో సినిమా చేయబోతున్నాడని ఓ టాక్ స్టార్ట్ అయ్యింది. ఆ దర్శకుడు మరెవరో కాదు సెన్సేషనల్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనునే. అయితే ఈ వైరల్ అవుతున్న టాక్ లో ఎంతవరకు నిజముందో అనే మాట పక్కన పెడితే అసలు ఈ కాంబోలో సినిమా రియాలిటీలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్న మొదటగా వినిపిస్తుంది.

ఒక పక్క పాలిటిక్స్, సినిమాలు చేస్తూ పవన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వచ్చే రెండేళ్ల వరకు ప్రస్తుతం కమిట్ అయ్యిన సినిమాలు చెయ్యడమే గగనంలా అనిపిస్తుంది. ఇక బోయపాటితో సినిమా అంటే అదెప్పుడు స్టార్ట్ అయ్యేది.? ప్రస్తుతానికి అయితే అసలు ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :