ఇంటర్వ్యూ : గౌతమ్ తిన్ననూరి – నాని గారి కాన్ఫిడెన్స్ చూసి భ‌య‌మేసింది !

మళ్ళీరావా తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి తొలి సినిమా తో డీసెంట్ హిట్ కొట్టాడు. ఇక ఈ చిత్రం తరువాత నాని తోజెర్సీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. నిన్న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా గౌతమ్ మీడియా తో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

జెర్సీ తెరకెక్కించాడానికి ఇన్‌స్పిరేష‌న్ ఎక్కడి నుండి వచ్చింది ?

హైద‌రాబాద్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ గురించి హ‌ర్ష బోగ్లే మాట్లాడుతూ స‌చిన్ కన్నా గొప్ప ఆట‌గాళ్లు చాలా మంది ఉన్నా కూడా ఆయ‌న అట్యిట్యూడ్ కార‌ణంగానే స‌చిన్ గొప్ప‌వాడైయ్యాడ‌ని అన్నారు. నాకు స‌చిన్ టెండూల్క‌ర్ గొప్ప‌త‌నం క‌న్నా.. ఆయ‌న‌లా టాలెంట్ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు క‌దా! అనే పాయింట్ బాగా న‌చ్చింది. సాధార‌ణంగా మ‌నం స‌క్సెస్ అయినోళ్ల‌నే గుర్తుపెట్టుకుంటాం. కానీ అంతే క‌ష్ట‌ప‌డి వేర్వేరు కార‌ణాల‌తో ల‌క్ష్యాన్ని చేరుకోని వాళ్లు చాలా మంది ఉంటారు. సో వారి గురించి చెప్పాలనుకున్నాను ఆలా ఈ జెర్సీ స్టోరీ ని త‌యారు చేసుకున్నాను.

మళ్ళీరావా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకు ?

మళ్ళీరావా ముందే ఈ జెర్సీ స్క్రిప్ట్ ను రాసుకున్న. నా ద‌గ్గ‌రున్న స్క్రిప్ట్స్‌లో నాకు ఇదే ఇష్ట‌మైన స్క్రిప్ట్‌. రెండు, మూడేళ్లు నా ద‌గ్గ‌రే ఉంది. అయితే ఆ ప‌రిస్థితుల్లో ఎవ‌రూ నాతో ఇలాంటి ఎమోషనల్ డ్రామా ను చేయ‌ర‌ని ఎవ‌రినీ అప్రోచ్ కాలేదు.

ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందని ముందే ఊహించారా ?

లేదండి. విడుదలకు ముందు వ‌ర‌కు ఇంత మంది నన్ను న‌మ్మారే ఏమ‌వుతుందో ఏమో అనే టెన్ష‌న్ పట్టుకుంది. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ వ‌చ్చి అంద‌ర‌రూ ఎంజాయ్ చేస్తున్నాకా కొంచెం రిలీఫ్ అయ్యాను. నేను ఎంజాయ్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది.

నాని తో పని చేయడం ఎలా అనిపించింది ?

ఈసినిమా ను నాని నాకంటే తనే ఎక్కువగా నమ్మాడు. ఆయన కాన్ఫిడెంట్ చూసి నాకు చాలా భయమేసింది. సినిమా కోసం ఎంత చేయాలో అంత చేసాడు నాని. అర్జున్ పాత్రను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు.

బాలీవుడ్‌లో సినిమాలు చేసే ఆలోచన వుంది ?

లేదండి ఇప్పట్లో అయితే అది కుదురదు. తెలుగులో నే ఇంకా మంచి సినిమాలు చేయాలి. ముందు క‌థ రాసుకున్న త‌ర్వాతే దానికి త‌గ్గ హీరోల‌ను క‌లిసి క‌థ చెబుతాను. ప్ర‌స్తుతం నా ద‌గ్గ‌ర కొన్ని క‌థ‌లున్నాయండీ. అయితే వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌ను. కాస్త గ్యాప్ తీసుకుని సినిమా చేస్తాను.

Exit mobile version