డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైన “గోవింద నామ్ మేరా”

డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైన “గోవింద నామ్ మేరా”

Published on Nov 18, 2022 2:00 PM IST

గోవింద నామ్ మేరా చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను ఎంచుకున్నట్లు ప్రకటించడానికి కొన్ని రోజుల క్రితం ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ మరియు నటుడు విక్కీ కౌశల్ ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు, ఓటిటి ప్లాట్‌ఫారమ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.

డిసెంబర్ 16, 2022న సినిమా తమ ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబడుతుందని ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ ద్వారా బ్యాంక్రోల్ చేయబడిన ఈ బిగ్గీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు