యూఎస్‌లో 1 మిలియన్‌కు దగ్గరైన ‘శాతకర్ణి’!
Published on Jan 15, 2017 9:58 am IST

GPSK
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన వందో సినిమా కావడం, విలక్షణ దర్శకుడు క్రిష్ సినిమా కావడంతో శాతకర్ణిపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సినిమా సూపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తెలుగు సినిమా ఈమధ్య కాలంలో పెద్ద మార్కెట్‌గా అవతరించిన యూఎస్‌లోనూ గౌతమిపుత్ర శాతకర్ణి దూసుకుపోతోంది.

సాధారణంగా యూఎస్‌లో బాలయ్య సినిమాలు ఇప్పటివరకూ పెద్దగా సందడి చేసింది లేదు. కాగా గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటివరకూ సుమారు 900కే డాలర్ల వరకూ వసూలు చేసింది. ఆదివారం పూర్తయ్యే సరికి ఈ సినిమా 1 మిలియన్ మార్క్ దాటేయనుంది. బాలకృష్ణ కెరీర్‌కు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇదే అతిపెద్ద హిట్‌గా చెప్పుకోవచ్చు. ఎవ్వరికీ పెద్దగా తెలియని తెలుగు జాతి గర్వించదగ్గ రాజు అయిన శాతకర్ణి గురించి చెప్పాలన్న క్రిష్ ప్రయత్నానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook