లాభాల బాట పట్టనున్న ‘శాతకర్ణి’ డిస్ట్రిబ్యూటర్స్!

Gautamiputra-Satakarni
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన వందో సినిమా కావడం, విలక్షణ దర్శకుడు క్రిష్ సినిమా కావడంతో శాతకర్ణిపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సినిమా సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాతకర్ణి డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్యకు స్ట్రాంగ్ మార్కెట్ అయిన సీడెడ్ ఏరియాలో శాతకర్ణి సినిమాను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. సినిమా తమ అంచనాలను మించేసిందని, రేపటితో బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందని, సోమవారం నుంచి లాభాల బాట పట్టనున్నామని తెలిపారు. అదేవిధంగా నైజాం, ఆంధ్రాలోని మిగతా ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేరుకుంటామని ఆశిస్తున్నారు. లాంగ్‌రన్‌లో సినిమా మంచి హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్‌గా నటించారు.