‘గౌతమిపుత్ర శాతకర్ణి’ శాటిలైట్ హక్కుల కోసం భారీ మొత్తం !

27th, December 2016 - 06:04:24 PM

gpsk
బాలయ్య 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పై ఎన్ని భారీ అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలకృష్ణ ఏంటో మక్కువతో చేస్తుండటం, నందమూరి వంశానికి బాగా కలిసొచ్చిన చారిత్రిక కథల నైపథ్యంలో ఉండే సినిమా కావడంతో సినిమా భారీ విజయం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఉండటంతో అన్ని రకాల హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నాయి.

తాజాగా సినీ వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ టీవీ ఛానెల్ ఒకటి రూ. 7 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ చాలా లాభసాటిగా జరిగిందని వినికిడి. అలనాటి నటి హేమా మాలిని చాన్నాళ్ల తరువాత ఈ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుండగా, కన్నడ శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే రాజీవ్ రెడ్డి, క్రిష్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించగా సాయి మాధవ్ బుర్రా మాటలను అందించారు.