
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రూస్ లీ’ పేరుతో రూపొందుతోన్న సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై అంతటా ఇప్పటికే విపరీతమైన అంచనాలుండగా, మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత స్క్రీన్‌పై కనిపించనున్న సినిమా కూడా ఇదే కావడంతో ‘బ్రూస్ లీ’పై అంచనాలు డబుల్ అయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరిన ఈ సినిమా అక్టోబర్ 16న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక ఆడియో ఆవిష్కరణ వేడుక రేపు (అక్టోబర్ 2) సాయంత్రం పెద్ద ఎత్తున వైభవంగా జరగనుంది.
హైద్రాబాద్‌లోని హైటెక్స్ గ్రౌండ్స్‌ను బ్రూస్ లీ ఆడియో రిలీజ్‌కు వేదికగా ఖరారు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ఇతర మెగా హీరోలు, టాప్ డైరెక్టర్స్ సమక్షంలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బ్రూస్ లీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇక ఇదే వేడుకలో చిరు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 150వ సినిమాకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్.ఎస్.థమన్ ఈ సినిమా సంగీతం సమకూర్చగా, రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు.